- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రావణి కేసు… నేడు కీలక మలుపు
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఊహించని పరిణామాలతో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నిందితుడు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకొని రెండో రోజు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం విడుదలైన ఓ వీడియో ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 7న దేవరాజ్ రెడ్డితో కలిసి శ్రావణి పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది.
అయితే, అక్కడికి వచ్చిన సాయి కృష్ణారెడ్డి ఆమెతో వాగ్వాదానికి దిగి.. ఆటోలో ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు ఈ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు, శ్రావణి కుటుంబ సభ్యులతో పాటు సాయికృష్ణారెడ్డిపై దేవరాజ్ కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. సాయికృష్ణారెడ్డి వేధింపుల వల్లే శ్రావణి బలవన్మరణానికి పాల్పడిందంటూ పోలీసులకు తెలిపాడు. అయితే, దేవరాజే ఆమెను మానసికంగా వేధించాడంటూ వారు పోలీసులకు ఆధారాలు అందించారు. సాయి కృష్ణారెడ్డిని రేపు విచారించనున్న నేపథ్యంలో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది.