సుశీల్ కుమార్‌ను ఉరి తీయండి : సాగర్ తల్లిదండ్రులు

by Shyam |
సుశీల్ కుమార్‌ను ఉరి తీయండి : సాగర్ తల్లిదండ్రులు
X

దిశ, స్పోర్ట్స్ : రెజ్లర్ సాగర్ దండక్ మరణానికి కారణమైన సుశీల్ కుమార్‌ను ఉరి తీయాలని సాగర్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మే 4న చత్రాసాల్ స్టేడియంలో సాగర్‌పై సుశీల్ కుమార్ అతడి స్నేహితులు బ్యాట్లతో దాడి చేశారు. దీంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. సుశీల్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ‘తన కొడుకును హత్య చేసిన వ్యక్తి మెంటార్‌గా ఉండేందుకు అనర్హుడు. అతడు సాధించిన పతకాలన్నీ వెనక్కి తీసుకోవాలి. సుశీల్ తనకు ఉన్న రాజకీయ పలుకు బడిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మేం పోలీసుల దర్యాప్తును నమ్ముతున్నాము. తన కొడుకు మరణానికి కారణమైన సుశీల్‌కు ఉరి శిక్ష విధించాలి. అంతే కాకుండా అతడికి ఇన్నాళ్లు ఎవరు ఆశ్రయమిచ్చారు.. ఎక్కడ తలదాచుకున్నాడు.. గ్యాంగ్ స్టర్లతో అతడికి ఉన్న సంబంధాలు ఏంటి అనే విషయాలు కూడా ఆరా తీయాలి’ అని సాగర్ తల్లదండ్రులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed