- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా ఎఫెక్ట్: కేరళ కీలక నిర్ణయం
by Shamantha N |

X
తిరువనంతపురం: కరోనా విజృంభిస్తుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సేఫ్టీ రూల్స్ మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నింబధనలను వచ్చేసంవత్సరం పాటు పాటించాల్సి ఉంటుంది. వివాహ వేడుకల్లో 50 మందికి, అంతిమ సంస్కారాల్లో 20 మందికి మించి అనుమతి లేదు. అధికారుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా ధర్నాలు, సభలు, సదస్సులు, ర్యాలీలు నిర్వహించకూడదు. అనుమతి తీసుకుని నిర్వహించినా 10 మందికి మించరాదు. ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు రావాలనుకునేవారు తప్పకుండా ఇ-జాగ్రత్త అనే డాక్యుమెంట్‌లో నమోదు చేసుకోవాలి.
Next Story