‘టాప్ 60’ కొవిడ్ 19 సురక్షిత దేశాలివే!

by  |
‘టాప్ 60’ కొవిడ్ 19 సురక్షిత దేశాలివే!
X

కొవిడ్ 19ను కట్టడి చేయడంలో ఒక్కో దేశానిది ఒక్కో ప్రత్యేక విధానం. నాలుగంచెల ఆరోగ్య సంరక్షణ విధానం పాటించి న్యూజిలాండ్ కరోనా ఫ్రీగా మారింది. కఠినమైన లాక్‌డౌన్ పాటించి ఫిజీ దేశం కరోనాను పారద్రోలింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్న దేశాలని చెప్పుకునేవి మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నాయి. నిజానికి కరోనాను రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. ఇక భారత్ విషయానికొస్తే కేసులు తక్కువగా నమోదవుతున్నపుడు బయట కనిపిస్తే బొక్కలు ఇరగొట్టారు, కానీ ఇప్పుడు కేసులు రికార్డులు బ్రేక్ చేస్తుంటే మాత్రం షాపింగ్ మాల్స్, పార్కులు, ఆఫీసులు తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా విషయంలో ఏ దేశం ఎంత సురక్షితంగా ఉందనే అంశం గురించి ఫోర్బ్స్ ఒక సర్వే నిర్వహించింది.

ఈ నివేదికలో కొవిడ్ 19 విషయంలో అత్యంత సురక్షితమైన దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. అమెరికా 58వ స్థానంలో ఉండగా, భారత్ 56వ స్థానంలో ఉంది. మొత్తంగా 130 నిర్మాణాత్మక, పరిమాణాత్మక పారామితుల ఆధారంగా ఈ సర్వే చేశారు. క్వారంటైన్ సమర్థత, పర్యవేక్షణ, కేసుల గుర్తింపు, హెల్త్ రెడీనెస్, ప్రభుత్వ చర్యలు వంటి 11,400 డేటా పాయింట్లను ఇందులో సేకరించారు. ఈ సర్వే నిర్వహించిన డీప్ నాలెడ్జ్ గ్రూప్ సంస్థ.. ఆసక్తికరంగా, ప్రతి నెలలో ఈ సురక్షిత ర్యాంకింగ్స్ మారాయని సంస్థ ప్రకటించింది. మొదట్లో ఈ సంక్షోభానికి త్వరగా స్పందించిన దేశాలు, అత్యుత్తమ అత్యవసర సేవలు అందించి ఉత్తమ ర్యాంకు సాధించాయి. కానీ తర్వాత ఇవే దేశాలు ఆర్థికపరమైన అభివృద్ధి కుంటుపడుతోందని భావించి సడలింపులివ్వడంతో వాటి ర్యాంకింగ్ పడిపోయిందని డీప్ నాలెడ్జ్ గ్రూప్ పేర్కొంది. అయితే విజ్ఞానులు, శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు అనుసరించి ఒక పద్ధతి ప్రకారం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినందుకే స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగలిగాయి. ఈ ర్యాంకింగ్‌లో దక్షిణ సూడాన్ చివరి స్థానంలో ఉంది.

టాప్ 60 దేశాలు…

1. స్విట్జర్లాండ్ 2. జర్మనీ 3. ఇజ్రాయెల్ 4. సింగపూర్ 5. జపాన్ 6. ఆస్ట్రియా 7. చైనా
8. ఆస్ట్రేలియా 9. న్యూజిలాండ్ 10. దక్షిణ కొరియా 11. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్
12. కెనడా 13. హాంకాంగ్ 14. నార్వే 15. డెన్మార్క్ 16. తైవాన్ 17. సౌదీ అరేబియా
18. హంగేరీ 19. నెదర్లాండ్స్ 20. వియత్నాం 21. కువైట్ 22. ఐస్‌లాండ్ 23. బహ్రెయిన్
24. ఫిన్‌లాండ్ 25. లక్సెంబర్గ్ 26. ఖతార్ 27. లిచ్టెన్‌స్టెయిన్ 28. పోలాండ్ 29. లిథువేనియా
30. మలేషియా 31. లాత్వియా 32. స్లోవేనియా 33. ఒమన్ 34. గ్రీస్ 35. ఎస్టోనియా
36. క్రొయేషియా 37. టర్కీ 38. ఐర్లాండ్ 39. జార్జియా 40. సైప్రస్ 41. చిలీ 42. మాంటెనీగ్రో
43. చెక్ రిపబ్లిక్ 44. మాల్టా 45. స్పెయిన్ 46. పోర్చుగల్ 47. థాయ్‌లాండ్ 48. బుల్గేరియా
49. గ్రీన్‌ల్యాండ్ 50. మెక్సికో 51. ఉరుగ్వే 52. వాటికన్ సిటీ 53. ఇటలీ 54. సెర్బియా
55. ఫిలిప్పీన్స్ 56. ఇండియా 57. రొమేనియా 58. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
59. స్లోవక్ రిపబ్లిక్ 60. ఫ్రాన్స్


Next Story

Most Viewed