- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మాను దానం చేయండి : సచిన్
దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శనివారం (ఏప్రిల్ 24) తన 48వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొని ముంబై తిరిగి వచ్చిన అనంతరం సచిన్ కోవిడ్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విడుదల చేశారు. ‘నేను కరోనా బారిన పడినప్పుడు వైద్య సేవలు చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు.
గత ఏడాది ఒక ప్లాస్మా డొనేషన్ కేంద్రాన్ని ప్రారంభించాను. వారి నుంచే ఈ సందేశం.. ప్లాస్మాను దానం చేయండి. కరోనా రోగికి సరైన సమయంలో ప్లాస్మా అందితే తప్పకుండా బతుకుతాడు. కరోనా నుంచి కోలుకున్న వారు తప్పకుండా ముందుకు రావాలి. నేను కూడా ప్లాస్మా దానం చేయడానికి సిద్దంగా ఉన్నాను. నా డాక్టర్లతో సంప్రదించి వాళ్లు ఓకే అంటే నేను దానం చేస్తాను’ అని సచిన్ వీడియోలో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ సమయంలో క్రిటికల్ కేర్‌లో ఉన్న రోగికి ప్లాస్మా చికిత్స చేయడం ద్వారా కోలుకునే అవకాశాలు ఉన్నాయి.