- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘పైలట్’తో రాహుల్, ప్రియాంక భేటి..

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. సోమవారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలతో రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ భేటి అయ్యారు. ఈ నెల 14నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్న నేపథ్యంలో వీరి మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై సచిన్ తన అసంతృప్తిని రాహుల్, ప్రియాంక ఎదుట వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సచిన్ పైలట్ మళ్లీ రెండు పదవులు చేపట్టాలని రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. అయితే, తనకు పదవుల కంటే ముందు భవిష్యత్‌లో సీఎం పదవి కట్టబెడుతారనే హామీని సచిన్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తన వర్గానికి చెందిన ఇద్దరిని డిప్యూటీ సీఎంలను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సచిన్ డిమాండ్లపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.
Next Story