- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీమా సంస్థ కొనుగోలుకు సచిన్ చర్చలు!
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (flipkart) సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్… కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ఇన్సూరెన్స్ విభాగం జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కో.లిమిటెడ్ (future generali india life insurance co. ltd) సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సచిన్ బన్సాల్‌కు చెందిన ఆర్థిక సేవల స్టార్టప్ నవీ టెక్నాలజీస్ (Navi Technologies) ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బీమా సంస్థను రూ. 1400-రూ. 1500 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదన దశలోనే ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
ఫ్యూచర్ జనరలి లైఫ్ ఇన్సూరెన్స్ పొందుపరిచిన విలువ రూ. 800 కోట్లు ఉండగా, పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఇప్పుడు 1.5 నుంచి 2 రెట్లు ఎక్కువ అంచనా వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ఇదివరకు జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారాల నుంచి నిష్క్రమించే సూచనలున్నాయని గతంలో పలు నివేదికలు తెలిపాయి.
తాజాగా, సచిన్ బన్సాల్ వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. 2018లో ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్, అంకిత్ అగర్వాల్‌తో కలిసి అదే ఏడాది డిసెంబర్‌లో ఆర్థిక సేవల స్టార్టప్ నవీ టెక్నాలజీస్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.