- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్ బోర్డు తప్పేమి లేదు: సబితా ఇంద్రారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయిస్తున్నట్లు ప్రకటించడంతో ఇంటర్ విద్యార్థులకు ఊరట కలిగినట్లు అయింది. మీడియా ముందుకు వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఇదే చివరిసారి అని, భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఇక ఉండవని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించామన్నారు. దూరదర్శన్ ద్వారా మారుమూల పల్లెల్లో కూడా విద్యార్థులకు క్లాసులు కండక్ట్ చేశామన్నారు. వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి పిల్లలు, టీచర్ల మధ్య సమన్వయం చేశామన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కోవిడ్ వేళ టెన్త్, ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేశామని, కోవిడ్ తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఇంటర్ ఫలితాలపై రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఇంటర్ బోర్డును విమర్శించడం సరికాదన్నారు. విద్యార్ధులకు టైమ్ ఇవ్వలేదనడం సరికాదన్నారు. ఇంటర్ బోర్డు తప్పేమీ లేదన్నారు.