- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జెర్సీ నెంబర్ 7 ఎవరికీ ఇవ్వొద్దు
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధరించిన జెర్సీ నెంబర్ 7ను భవిష్యత్‌లో ఎవరికీ కేటాయించ వద్దని మాజీ క్రికెటర్ సాబా కరీమ్ సూచించాడు. ధోనీతో పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన దిగ్గజ క్రికెటర్ల జెర్సీ నెంబర్లను బీసీసీఐ దాచి పెట్టి గౌరవించాలని ఆయన సూచించాడు. జెర్సీ నెంబర్లను దాచి పెట్టడం అంటే.. ఆ ఆటగాళ్లకు మనం ఇచ్చే గౌరవమే అని కరీమ్ అన్నాడు.
అప్పట్లో సచిన్ రిటైర్ అయ్యాక జెర్సీ నెంబర్ 10ని వేరే క్రికెటర్‌కు కేటాయించారు. కానీ తర్వాత వెంటనే ఆ తప్పిదాన్ని బీసీసీఐ సరి చేసుకున్నది. అప్పటి నుంచి సచిన్ నెంబర్‌ను ఎవరికీ కేటాయించడం లేదు. మహీ ఇకపై క్రికెట్ ఆడకపోయినా.. యువ క్రికెటర్లకు మంచి మార్గదర్శిగా ఉంటాడని.. అతడి సేవలు భారత క్రికెట్‌కు కొనసాగుతూనే ఉంటాయని కరీమ్ జోస్యం చెప్పాడు. అలాంటి దిగ్గజాలు ఉంటే భారత క్రికెట్ భవిష్యత్‌కు మంచి జరుగుతుందని కరీమ్ అన్నాడు.