రహస్యంగా సాహో డైరెక్టర్ పెండ్లి!

by  |
రహస్యంగా సాహో డైరెక్టర్ పెండ్లి!
X

‘ర‌న్ రాజా ర‌న్’ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సుజీత్.. ఇటీవ‌ల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో అనే భారీ బ‌డ్జెట్ మూవీ తీశాడు. ఆ చిత్రం సుజీత్ క్రేజ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కాగా, త్వ‌ర‌లోనే ఆయ‌న మెగాస్టార్ చిరుతో లూసీఫ‌ర్ రీమేక్ చేస్తాడ‌ని భావించ‌గా ప్ర‌స్తుతం హోల్డ్‌లో పెట్టారు. దీంతో శ‌ర్వానంద్ లేదా గోపిచంద్‌తో మూవీ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అయితే, ఇటీవ‌ల‌ త‌న ప్రేయ‌సి ప్ర‌వ‌ల్లిక‌తో గోల్కొండ రిసార్ట్స్‌లో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న సుజీత్.. ఆదివారం కొద్ది మంది ఆత్మీయుల స‌మ‌క్షంలో పెండ్లి పీట‌లెక్కిన‌ట్లు తెలుస్తోంది.

సుజీత్, ప్రవల్లిక పెండ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆగస్టు 2 రాత్రి నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్ర‌వల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా, ప్ర‌స్తుతం స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేస్తోంది. టిక్ టాక్ వీడియోలలో ఆమె ఇప్పటికే ఫేమస్ అయ్యింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెండ్లి చేసుకోనున్నారని తెలుస్తుండగా.. పెండ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.


Next Story

Most Viewed