- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులకు శుభవార్త.. రైతుబంధు విడుదల

దిశ, హైదరాబాద్: రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం ఒకే రోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రూ. 5294.53 కోట్ల రూపాయాలు ఆయా ఖాతాల్లోకి జమ అయ్యాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి గంటకు పది లక్షల మందికి చొప్పున నగదు బదిలీ చేశామని ఆయన వివరించారు. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన రూ.82.37 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల జూన్ 16 వరకు పాస్ బుక్‌లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుందని మంత్రి సింగిరెడ్డి తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో నగదు విడుదల చేశామని చెప్పుకొచ్చారు. దాదాపు 5 లక్షల మంది రైతులు బ్యాంకుల వివరాలు ఇవ్వలేదని.. ఏఈఓలకు వివరాలు అందగానే ఖాతాలలో నిధులు జమచేయాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.