మోడీ అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు : పుతిన్

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు 70వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా దేశ అధ్యక్షులు, మోడీ ఫ్రెండ్ వ్లాదిమిర్ పుతిన్‌ కూడా మోడీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ సందేశం పంపించారు.

‘‘ప్రభుత్వాధినేతగా భారత దేశానికి మీరు చేస్తున్న సేవకు గాను స్వదేశంతో పాటు అత్యున్నత అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. మీ సారథ్యంలో సామాజిక ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ పురోగమిస్తోంది. మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీరు అందించిన తోడ్పాటు వెలకట్టలేనిది. రష్యా, ఇండియా మధ్య ఉన్న స్వేహబంధానికి నేను ఎంతో విలువ ఇస్తాను. అంతర్జాతీయ వ్యవహారాలు, ద్వైపాక్షిక అంశాల్లో నిర్మాణాత్మక చర్చలతో పాటు కలిసి పనిచేయడాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆకాంక్షిస్తున్నా. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అన్నింటా విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అని పుతిన్ తెలిపారు.

Advertisement