ధృవ్ విక్రమ్‌పై ఫేక్ న్యూస్

by Shyam |
ధృవ్ విక్రమ్‌పై ఫేక్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: చియాన్ విక్రమ్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్ విక్రమ్ తొలి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ధృవ్ గ్రాండ్ విక్టరీ అందుకున్నాడు. కానీ తర్వాత ఏ మూవీ చేస్తున్నాడనేది ప్రకటించకపోవడంతో…. ధృవ్ సినిమాలకు స్వస్తి చెప్పి మళ్లీ చదువుబాట పడుతున్నాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. విదేశాలకు వెళ్లి మళ్లీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తాడనే న్యూస్ హల్ చల్ చేసింది. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది. ధృవ్ తన తర్వాతి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తాడని సమాచారం. సెల్వరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి సినిమా చేస్తున్న సెల్వరాజ్ .. తర్వాత ధృవ్‌ను డైరెక్ట్ చేయనున్నాడు.

కాగా విక్రమ్ తన కొడుకు కెరియర్‌ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధృవ్ ఫస్ట్ మూవీ ‘వర్మ’ పేరుతో 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నా ఔట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో…. నటీనటులు, టెక్నిషియన్స్‌ను మార్చేసి మళ్లీ కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేలా చేశాడు. పలితంగా ‘ఆదిత్య వర్మ’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

tags:Chiyaan Vikram, Dhruv Vikram, Fake News, Aditya Varma, Arjun Reddy

Advertisement

Next Story