శ్రుతి హాసన్‌తో ప్రేమపై ట్విస్ట్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

by Jakkula Samataha |
Shruthi Hassan, Shanthanu Hazarika
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ మళ్లీ ప్రేమలో పడిందని సోషల్ మీడియా కన్‌ఫర్మ్ చేసేసింది. శాంతను హజారికా అనే డూడిల్ ఆర్టిస్ట్‌తో ప్రజెంట్ డేటింగ్ చేస్తోందని రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ తరచూ జంటగా కనిపిస్తుండటంతో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ కాగా.. శ్రుతి పుట్టినరోజున శాంతను పెట్టిన పోస్ట్‌తో కన్‌ఫర్మ్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ తమ మధ్య అలాంటి రిలేషన్‌షిప్ లేదని స్పష్టం చేశాడు శాంతను. ఓ ఎంటర్‌టైన్మెంట్ మీడియా చానల్‌తో మాట్లాడిన శ్రుతి రూమర్డ్ బాయ్ ఫ్రెండ్.. ఆర్ట్, మ్యూజిక్‌పై ఉన్న పాషన్ తామిద్దరినీ మంచి ఫ్రెండ్స్‌గా మార్చాయని తెలిపాడు. తన ఆర్ట్ గురించి తెలుసుకుని శ్రుతి తనకు దగ్గరైందని, మ్యూజిక్ ద్వారా ఫస్ట్ కనెక్ట్ అయ్యామని చెప్పాడు. శ్రుతికి డ్రాయింగ్ అండ్ ఆర్ట్‌లోనూ ఇంట్రెస్ట్ ఉందని, కొన్నిసార్లు తనతో కలిసి పెయింటింగ్, డ్రాయింగ్ కూడా వేస్తుందని.. తను అందులోనూ పర్‌ఫెక్ట్ అని చెప్పుకొచ్చాడు శాంతను.

Advertisement

Next Story

Most Viewed