2 డీజీపై వదంతులు నమ్మొద్దు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్

by Shamantha N |
Dr. Reddys Lab
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలో డీఆర్‌డీవోకు చెందిన ఇన్మాస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా ఔషధం 2 డీజీపై వదంతలు పుట్టుకొస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మవద్దని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మాడరేట్ లేదా సివియర్ కేసుల్లో కరోనా పేషెంట్లకు చికిత్సతోపాటు అదనంగా అందించడానికి 2 డీజీ మందుకు డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాంటీ వైరల్ డ్రగ్‌ను ఇంకా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టలేదని, దాని సాచెట్ ధరనూ నిర్ణయించలేదని రెడ్డీస్ ల్యాబ్ స్పష్టం చేసింది. వచ్చే నెలలోనే 2 డీజీని లాంచ్ చేసి, ప్రధానమైన ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైవేటు హాస్పిటళ్లకు సరఫరా చేసే అవకాశముందని వివరించింది. పేషెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ధరను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. కాబట్టి, 2 డీజీ పేరుతో కొందరు ఏజెంట్లు, మోసకారులు అమ్మే నకిలీ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా, వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతున్న అవాస్తవ సందేశాలను నమ్మవద్దని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed