బ్రిటన్ రాజకుటుంబంలో పేర్ల వెనకున్న రహస్యాలు

by Shyam |
britain royal family
X

దిశ, ఫీచర్స్: బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు ఇటీవలే ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి నచ్చకపోవడంతో ప్యాలెస్‌తో పాటు రాజకుటుంబాన్ని వీడిన ఈ జంట కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఈ మేరకు బ్రిటన్ రాజకుటుంబంలోని వివాదాలు ప్రపంచానికి తెలియగా.. వాళ్లు పాటించే రూల్స్, ఫాలో అయ్యే అంశాలన్నీ ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. కాగా రాయల్ పేరెంట్స్ తమ బిడ్డ పేరును ప్రకటించే ముందు క్వీన్ ఎలిజబెత్-2కు తెలియజేయాలనే నియమం ఉంది. లూయిస్ నుంచి ఆర్చి వరకు బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక బిడ్డ పుడితే.. అతడు లేదా ఆమె పేరు గురించి ప్రజల్లో తీవ్రమైన ఊహగానాలు నెలకొనడమే కాక రాయల్ బేబీ పేర్లపై బుకీలు పందెం కూడా వేస్తారు.

పేర్లకు సర్‌నేమ్స్ ఉండటం చాలా సాధారణ విషయం. కానీ రాయల్ బేబీస్ విషయంలో మాత్రం ‘సర్ నేమ్’ కనిపించదు. ఓసారి బ్రిటన్ రాజవంశానికి చెందిన పిల్లల పేర్లను గమనిస్తే.. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ పిల్లలు ‘ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్, ప్రిన్స్ లూయిస్’ అధికారిక ఇంటిపేరును కలిగి ఉండరు. అయితే వారి తల్లిదండ్రులకు కేటాయించిన డ్యూక్డమ్ గౌరవార్థం, అవసరమైనప్పుడు తమ పేర్లలో కేంబ్రిడ్జిని ఉపయోగిస్తారు. మేఘన్, ప్రిన్స్ హ్యారీ కుమారుడి విషయంలో మాత్రం మినహాయింపు ఉంది. వారి కుమారుడు ఆర్చికి లాస్ట్ నేమ్ మౌంట్ బాటన్-విండ్సర్ అని ఉంటుంది.

మూడు పేర్లు..

రాయల్ పేరెంట్స్ కనీసం మూడు పేర్లను ఎన్నుకుంటారు. అయితే ప్రిన్స్ విలియమ్‌కు మాత్రం నాలుగు పేర్లు ఉన్నాయని ఇండిపెండెంట్ పత్రిక నివేదించింది. అంతేకాదు ఒకే పేరు కంటిన్యూ కావడం కూడా రాజకుటుంబంలో సర్వసాధారణం. 1819లో క్వీన్ విక్టోరియా జన్మించినప్పటి నుంచి రాజ కుటుంబంలోని తొమ్మిది మందికి ‘విక్టోరియా’ అని పేరు పెట్టగా, గత రెండు శతాబ్దాలుగా పన్నెండు మంది సంతానానికి ‘ఆల్బర్ట్’ అని పేరు పెట్టారు. ఇక రాజకుటుంబంలో పుట్టిన తమ సంతానానికి పేర్లు పెట్టే విషయంలో రాణికి ముందే చెప్పాలి, కానీ అందుకు ఆమె ఆమోదం అవసరం లేదు. వాస్తవానికి రాణిని గౌరవిస్తూ, పేరును ముందు చెబుతారు. ఒకవేళ తనకు నిజంగా ఆ పేరు నచ్చకపోతే, కచ్చితంగా దానిని పరిగణనలోకి తీసుకుంటారు’ అని రాయల్ కామెంటేటర్ కేట్ విలియమ్స్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed