- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు రూల్స్ వర్తించవా?
దిశ, న్యూస్‌బ్యూరో :
తెలంగాణలో చట్టాలు, రూల్స్ ఉన్నది కేవలం సామాన్య ప్రజల కోసమేనని అవేవీ ఆ చట్టాలు, రూల్స్ చేసే తమకు వర్తించనట్లుంది ప్రభుత్వ పెద్దల తీరు. ఇక మొక్కలు నాటడం, హరితహారం కార్యక్రమాల విషయానికొస్తే కేసీఆర్, కేటీఆర్ దగ్గరనుంచి కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు, రాజ్యసభ ఎంపీ సంతోష్ దాకా రోజుకో మొక్క నాటకుండా ఎవరూ నిద్రపోవడానికీ వీల్లేదన్నట్లు స్పీచ్‌లిస్తుంటారు. కానీ వాళ్లు చేసే పనులు మాత్రం పూర్తి డిఫరెంట్‌గా ఉంటున్నాయి. తాము చెప్పే మాటలు అందరూ పాటించడానికే కానీ.. మాకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు విషయానికొస్తే..
అది హైదరాబాద్‌లోని ఇళ్లకు, ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఉన్న కూకట్‌పల్లి ప్రాంతం. అక్కడ ఇందూ ఫార్చూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీనీ మెయింటెయిన్ చేసేవాళ్లకు అందులో అదనపు సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన వచ్చింది. అందుకు అడ్డుగా ఉన్నాయని గేటేడ్ కమ్యూనిటీలోని 40 చెట్లను నరికి వేశారు. వాటిని ట్రాన్స్‌లొకేట్ (జాగ్రత్తగా తొలగించి వేరేచోట నాటడం) కూడా చేశామని తెలిపారు. అయినా సంతృప్తి చెందని మేడ్చల్ జిల్లా ఫారెస్ట్ అధికారులు వారికి 54 వేల రూపాయల ఫైన్ వేశారు. అంతటితో ఆగకుండా కొట్టేసిన 40 చెట్లకు బదులు 80 చెట్లు నాటి పెంచాలని ఆర్డర్ వేశారు. అయితే ఇది సామాన్యుల విషయంలో జరిగింది. మరి ప్రభుత్వంలోని ఓ కీలక నేత… స్వయానా కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విషయంలో ఇందుకు పూర్తి డిఫరెంట్‌గా జరిగింది. ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే..
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దే పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ ఈ నెల 24న మహబూబ్‌నగర్ వెళ్లారు. మహబూబ్ నగర్ పట్టణంలోని డైట్ కళాశాల వద్ద ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. అయితే ఈ మార్కెట్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న కొన్ని చెట్లు అధికారుల కంటబడ్డాయి. ఇంకేముంది.. మంత్రిగారి ప్రోగ్రాంలో డిస్ట్రబెన్స్ ఎందుకనుకున్నారో ఏమో వాటిని నరికి తొలగించి వేశారు అక్కడి అధికారులు. ట్రాన్స్‌లొకేట్ చేయడానికి పూర్తి అనుకూలంగా ఉన్న 20 ఏళ్లకు మించి వయసున్న చెట్లను ఆఘమేఘాల మీద నరికివేశారు. విద్యార్థులు కాళ్ళావేళ్ళా పడ్డా అధికారుల్లో ఆలోచన రాలేదు. ఎంతైనా మంత్రిగారి ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయిందిగదా!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే పట్టణ ప్రగతిలో ప్రసంగించిన కేటీఆర్ మొక్కలు నాటి వాటిని కాపాడని అధికారులకు, ప్రజాప్రతినిధులకు పోస్టులు ఊడతాయని హెచ్చరించారు. మరి ఆయన ప్రోగ్రాంకు ముందు జరిగిన చెట్ల నరికివేతకు ఎవరి పదవి పోతుందో మాత్రం కేటీఆర్ చెప్పలేదు. ఇలా తాము చెప్పే మాటలను తామే పాటించని పరస్థితిలో ప్రభుత్వ పెదలున్నపుడు ప్రజలు మాత్రం ఎందుకు పాటిస్తారన్న విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులకైతే ఉద్యోగాలు, పదవులు పోవడం, జరిమానాలు పడడం లాంటివి జరుగుతాయి కానీ నేతలకు అవేవీ ఉండవా అనే ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం లేదు.