- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నా బాడీ కొలతలే కావాలా మీకు..?

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్ 14’ విజేత రుబీనా దిలైక్.. తనపై వస్తున్న బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నిజమైన అభిమానులు కాకుండా నకిలీ ఫ్యాన్స్ కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని తెలిపింది. ‘ప్రియమైన సూడో అభిమానులారా నా బరువు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నేను గమనిస్తున్నాను. కానీ నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించకుండా మీరు నా బాడీపై పంపించే ద్వేషపూరిత సందేశాలు చూసి ఆవేదన చెందాను. ఎందుకంటే నా ప్రతిభ, పని నిబద్ధతకంటే.. నేను ఏ బట్టలు ధరించాను? నా శారీరక రూపం ఎలా ఉంది? అనేదే మీకు ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ నేను నా నిజమైన అభిమానులను గౌరవిస్తాను.
ఫేక్ ఫ్యాన్స్.. దయచేసి మీరు నా అభిమానిగా ఫీల్ కావొద్దు’ అని చెప్పింది. అలాగే తన కుటుంబ సభ్యులను ట్యాగ్ చేస్తూ.. ‘రుబీనా కష్టపడి పనిచేయడం లేదు. వృద్ధాప్యంలో ఉంది. బరువు పెరిగింది’ అంటూ వారిని ఇబ్బందిపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ చర్యల వల్ల నా కుటుంబం సమస్యల్లో చిక్కుకుపోతుంది’ అని బాధపడింది. ఇక కొవిడ్ వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని.. గోర్లు, వెంట్రుకలు, చర్మం కాస్త రంగు తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నట్లు వివరించింది.