- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌ను వీడిన సజ్జనార్.. కొత్త ఆపరేషన్ స్టార్ట్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రయాణికుల ఆదరణతో టీఎస్‌ఆర్టీసీ లాభాల వైపు దూసుకుపోతోంది. ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను నియమించిన రోజు నుంచి సంస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రయాణీకులను ఆకర్షించే విధంగా ఉండి సంస్థ అభివృద్ధికి దోహాదపడుతున్నాయి. ప్రయాణికుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలతో మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీలో పలు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే, ఇన్ని రోజులూ హైదరాబాద్ పరిధిలోని MGBS, JBS బస్ స్టేషన్ల అభివృద్ధిపైనే దృష్టి సారించిన సజ్జనార్ జిల్లాలలోని బస్టాండ్‌ల పరిస్థితులను తెలుసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి నల్గొండ వెళ్లారు. బస్టాండ్‌లోని సదుపాయాలపై ప్రయాణీకులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సజ్జనార్ ఏ రోజు ఏ జిల్లాకి, ఏ డిపోకైనా వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో సజ్జనార్ తీసుకొస్తున్న మార్పులపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.