- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల వేధింపులు.. ఆర్టీసీ డిపో ముందు డ్రైవర్ ఆత్మహత్య
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ అధికారుల వేధింపులతో రాణిగంజ్–1 డిపోకు చెందిన అర్టీసీ డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) పురుగుల మందు తాగి డిపో ముందు ఆత్మ హత్య చేసుకున్నాడు. పలు కారణాలతో తిరుపతి రెడ్డి రెండు రోజులు విధులకు హాజరు కాలేదు. అనంతరం ఈ నెల 22న తిరిగి విధుల్లో చేరాడు. అయితే, అప్పటి నుంచి తిరుపతిరెడ్డికి విధులు కేటాయించకుండా అధికారులు తిప్పుతున్నారు. డిపో దగ్గరకు వెళ్లడం, అక్కడే ఖాళీగా ఉంటూ ఇప్పటి దాకా ఎదురుచూశాడు.
మంగళవారం ఉదయం కూడా డిపోకు వచ్చిన తిరుపతిరెడ్డికి ఈరోజు కూడా డ్యూటీ ఇవ్వకపోవడంతో ఉదయం 6.45 గంటలకు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్యకు యత్నం చేశాడు. గుర్తించి సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు భారీగా రాణిగంజ్–1 డిపో వద్దకు చేరుకున్నారు. తిరుపతిరెడ్డి మృతికి అధికారుల వేధింపులే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.