- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డెక్కని బస్సులు..మూగబోయిన జేబీఎస్,ఎంజీబీఎస్!
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు తెలంగాణ ఆర్టీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం తెల్లవారు జామున బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బస్సులు రోడ్డు మీదకు రాకపోవడంతో నగరంలోని ప్రధాన బస్‌స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ ప్లే గ్రౌండ్స్‌ను తలిపిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో ఇతర వాహనదారుల రద్దీ కూడా తగ్గిపోయింది. అయితే, రాష్ట్రంలోని పలు బస్సు డిపోల ఎదుట విపక్షాలు రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఉద్యోగులు, బస్సులపై ఆధారపడిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కాగా, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేవలం నాలుగు గంటలు మాత్రమే బంద్ పాటించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.