- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
by Shyam |

X
దిశ, డోర్నకల్ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రహరీ గోడను ఢీ కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు మానుకోట నుంచి సూర్యాపేటకు బయలు దేరింది. ఈ క్రమంలో అయ్యగారిపల్లి గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న మేక సురేష్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా బయట పడ్డారు.
Next Story