‘ఎన్జీవోలు పంచే ఫుడ్ ప్యాకెట్లను తమవిగా చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్’

by Shamantha N |
‘ఎన్జీవోలు పంచే ఫుడ్ ప్యాకెట్లను తమవిగా చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్’
X

లక్నో: లాక్‌డౌన్ సమయంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలను ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్ఎస్ఎస్) తమవిగా చెప్పుకుంటూ బీజేపీ కార్యకర్తలకు పంచుతోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అంతేకాకుండా దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుంటే ఆర్ఎస్ఎస్‌ మాత్రం కుటుంబ శాఖను ఎందుకు జరుపుతోందని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. నిజాయితీగా పనిచేయాల్సిన బీజేపీ ప్రభుత్వం.. రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా అందడంలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే బీజేపీ ప్రభుత్వం ఎన్నికైందా? అంటూ నిలదీశారు. కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో దేశమంతా ఐక్యంగా ఉండి, లాక్‌డౌన్‌కు మద్దతిస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. కూలీలు, పేదలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

tags: rss, bjp, akhilesh yadav, uttar pradesh, food packets, ngos, bjp activists

Advertisement

Next Story

Most Viewed