- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌ను తరిమికొట్టాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, నిజామాబాద్ రూరల్: సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్ నుంచి తరిమికొట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో బహుజన ఎంప్లాయిస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గడీల రాజ్యానికి చరమగీతం పాడే పరిస్థితులు త్వరలోనే అంటూ హెచ్చరించారు.
అంతా అక్రమాలే..
టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రతీ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు దోచుకున్న డబ్బులతో పేదలకు ఉచితంగా ఆండ్రాయిడ్ ఫోన్ పంపిణీ చేయవచ్చని సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు కూడా దళితుల పేరు ఎత్తని కేసీఆర్.. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఆర్థిక సాయం అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉపఎన్నిక కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని.. కేసీఆర్ తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.
అందుకే రాజకీయాల్లోకి వచ్చా..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకం కావాలని అప్పడే దొరల పాలనపోయి సామాజిక న్యాయం కలుగుతోందన్నారు ఆర్‌ఎస్గ ప్రవీణ్ కుమార్. బహుజనుల కోసమే తన ఐపీఎస్ పదవిని వదిలిపెట్టానని.. తెలంగాణలో అవినీతిని అరికట్టేందుకు, బహుజనుల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశారు. 2023లో అధికారంలోకి వచ్చేందుకు బహుజనులు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. తనకు అధికారం మీద ఆశలు లేవన్న ప్రవీణ్ కుమార్.. బహుజనులను అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తానని వెల్లడించారు.