- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డికి రూ. 996 కోట్లు ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి వివిధ అభివృద్ధి పనులకు 996 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఉన్న మహబూబ్ సాగర్ ట్యాంక్ బండ్ ని టూరిజంగా తీర్చిదిద్దాలని ట్యాంక్ బండ్ చుట్టూ 15 కిలోమీటర్లు నెక్లెస్ రోడ్డు చేస్తూ చుట్టూ ట్యాంక్ బండ్‌ని సుందరికారణ చేసి, చెరువులో బోటింగ్ లేసర్ లైట్స్ ,రెస్టౌరెంట్ కాటేజెస్, స్పోర్ట్స్, యోగ సెంటర్, జిమ్ వీటికోసం స్టేట్ లేదా సెంట్రల్ ఫండ్స్ ద్వారా రూ 200 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
ఎన్ హెచ్ 65 నుంచి సంగారెడ్డి,నాందేడ్ ,అకోలా రోడ్డు ఎన్ హెచ్ 161 వైపు సాయిబాబా టెంపుల్ సంగారెడ్డి పట్టణంలో సెంట్రల్ మీడియా, ఫ్లడ్ లైటినింగ్ కోసం రూ 12 కోట్లు హెచ్‌ఏండీఏ ఫండ్స్ నుండి విడుదల చేయాలని కోరారు. కంది మండలం ఎన్‌హెచ్ 65 నుండి భూలక్ష్మామ్మ దేవాలయం కలివేముల వరకు బీటీ రోడ్డు కోసం రూ 45 లక్షలు హెచ్‌ఏండీఏ ఫండ్స్ నుండి లేదా ఇతర గ్రాంట్స్ నుంచి మంజూరు చేయాలని కోరారు. సంగారెడ్డి మున్సిపాలిటీ కోసం హెచ్ఏండీఏ ఫండ్స్ నుంచి రూ 100 కోట్లు సీసీ రోడ్స్ , డ్రైన్స్ , కమ్యూనిటీ హాల్స్ కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. కిసాన్ సాగర చెరువు కోసం రూ 30 కోట్లు ఇచ్చి కంది మండలాన్ని టూరిజం ప్లేస్ గా చేయాలని కోరారు.
దేవుని చెరువు అభివృద్ధి చేస్తూ కంది మండలం పర్యాటక ప్రాంతంగా చేయడానికి రూ 30 కోట్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కంది మండలం లో ఉన్న పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు టూరిజం ప్రాంతాలుగా చేయాలని దానికోసం రూ 30 కోట్లు ఇవ్వాలని కోరారు. ఎర్రకుంటా చెరువు అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేసి సంగారెడ్డి పట్టణాన్ని టూరిజం ప్లేస్ గా చేయాలని కోరారు. దూద్ భాయ్ చెరువు, కట్ట కొమ్ము చెరువుల అభివృద్ధి కోసం 30 కోట్లు కేటాయించి సంగారెడ్డి టౌన్ ను టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరారు. సదాశివపేట మున్సిపాలిటీ లో త్రాగు నీరు సరఫరా పైప్ లైన్స్ అలాగే సపరేట్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు కోసం రూ 200 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
అలాగే పటాన్ చెరువు నుండి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం సంగారెడ్డి లో ఉన్న అంబేద్కర్ స్టేడియం వద్ద కొత్తగా ఒక న్యూ ఇండోర్ స్టేడియం ను మంజూరు చేస్తూ వివిధ క్రీడలకు గాను కొత్త కోచ్లను అపాయింట్ చేయాలి. సంగారెడ్డిలో ఉన్న శిల్పారామంలో పెండింగ్ పనులు, మరమత్తుల కోసం గాను రూ.5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, 2013 లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సదాశివపేట్ మండలం సిద్దాపూర్ గ్రామంలో 100 ఎకరాలు భూసేకరణ చేసి 5 వేల ఇండ్ల స్థలాలు పొజిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అలియాబాద్, కొండాపూర్ మండలల్లో 3830 ఇండ్ల స్థలాలు పొజిషన్ ఇవ్వడం జరిగింది.
వీరికి పట్టాలు కూడా ఇచ్చామన్నారు. కానీ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీసులు లబ్దిదారులకు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలా చేయకుండా ప్రభుత్వం ఆ పేద వారి ఇండ్ల స్థలాల పొజిషన్ తిరిగి ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 40 వేల మంది పేద ప్రజలకు ఇండ్ల కోసం భూమి ఇవ్వాలని అందుకోసం 1000 ఎకరాల భూమి సేకరించడానికి రూ 150 కోట్లు మంజూరు చేయాలని జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డిలోని గంజ్ మైదాన్ లో బిష్మ గంగపుత్ర ఫంక్షన్ హాల్ కోసం రూ. 2 కోట్లు మంజూరు చేయాలి.
సంగారెడ్డి నియోజకవర్గం టౌన్ లో ఫిష్ మార్కెట్ స్థలంలో ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ హాల్ కి గాను 50 లక్షలు మంజూరు చేయాలన్నారు. సంగారెడ్డి లోని 38 వార్డులకు గాను డ్వాక్రా మహిళా గ్రూప్ ల భవనాలు ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. సదాశివపేట లోని 28 వార్డు లలో డ్వాక్రా మహిళా గ్రూప్ భవనాలకు గాను ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాలన్నారు.