- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రానైట్స్ ఓనర్స్ అసోసియేషన్ రూ.5 లక్షల విరాళం

దిశ, వరంగల్:
కరోనా బాధితులను ఆదుకునేందుకు వరంగల్ గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ చెక్కును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంగళవారం అందజేసింది. కరోనా వైరస్ నిర్మూలనకు తమ సహాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఈ విరాళం అందజేస్తున్నట్టు వరంగల్ గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. సీఎం సహాయ నిధికి విరాళం అందచేసిన గ్రానైట్ అసోసియేషన్ వారికి, ఆ సంఘం సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.
అనంతరం తెలంగాణ అర్చక సంఘం వారు రూ.1 లక్ష విరాళాన్ని సీఎంఆర్ఎఫ్ కోసం మంత్రికి అందజేశారు. కరోనా నిర్మూలనకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో విరాళం ప్రకటించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: carona, cmrf, granites association, rs.5lacs