రూ. 50 లక్షలు.. ఒకరికి ఉద్యోగం

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌షిప్ యార్డును ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం షిప్ యార్డు యాజమాన్యం, అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రమాదం ఎలా జరిగిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ షిప్ యార్డు ప్రమాదం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృతుల్లో ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించనున్నట్లు యాజమాన్యం హామీ ఇచ్చింది.

Advertisement