- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారిపై అత్యాచారం.. రూ. 2 వేలు జరిమానా
దిశ ప్రతినిధి, హైదరాబాద్: అభం, శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద 20 యేండ్ల జైలు, రూ. 2 వేల ఫెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆబిడ్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య కేసు వివరాలు వెల్లడించారు. 2017 లో అబిడ్స్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై.. అదే పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అలహాబాద్‌కు చెందిన కమల్ బాన్ (30) అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్పట్లో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న గంగారామ్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయ స్థానం ముందు హాజరుపర్చారు. అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తుండగా పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు న్యాయస్థానం ముందు సమర్పించారు. కేసు పూర్వా పరాలు విచారించిన నాంపల్లి పోక్సో కేసెస్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు స్పెషల్ జడ్జి ప్రేమలత.. బుధవారం నిందితుడికి 20 యేండ్ల జైలు, రూ 2 వేలు ఫెనాల్టీ విధిస్తూ తీర్పునిచ్చారు.