- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేటలో భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం.. రైతులకు మనీ రీఫండ్!
దిశ, సూర్యాపేట : ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అక్రమార్కులను హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పీ ఆర్ భాస్కరన్‌తో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చింతలపాలెం మండలం దొండపాడులో నకిలీ విత్తనాలు అమ్ముతున్న లక్ష్మిరెడ్డి, ప్రతాప్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హైదారాబాద్ వనస్థలిపురంలో ద్వారకా సీడ్స్ శివారెడ్డి అందించిన సమాచారం ప్రకారం 986 కిలోల మిర్చి, టమాట, బీరకాయ అలాగే పుచ్చకాయ నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.13 కోట్ల 51 లక్షల 50 వేల పైచిలుకు ఉంటుందని అంచనా. ఈ విత్తనాలను చింతలపాలెం, హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ద్వారకా సీడ్స్ వారు కాల పరిమితి దాటిన విత్తనాలను కూడా కొత్తగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని, అలాగే ఒకే అనుమతితో అన్ని విత్తనాలు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. వానాకాలం పంటల కోసం రైతులు ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ కేంద్రాల ద్వారా మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధిత మోసగాళ్ల నుంచి తిరిగి చెల్లింపులు చేయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో టాస్క్ ఫోర్స్ అదికారులు అన్ని విత్తనాలు, ఎరువుల షాపులలో తనిఖీలు చేస్తున్నారని స్పష్టంచేశారు.
భారీ స్థాయిలో నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను టి. వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేని విత్తనాలను అమ్ముతున్న వారిని ఒక రైతు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన పట్టుకున్నామన్నారు. ద్వారకా సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాలపాటి వెంకట శివారెడ్డి, రీజినల్ మేనేజర్ వేమిరెడ్డి లక్ష్మి రెడ్డి, రైతు వాసిరెడ్డి ప్రతాప్ కుమార్, అకౌంటెంట్ సుకురి యాదగిరి, రైతు మాడా జగన్ మోహన్ రావు, రమణ హైదరాబాద్ నివాసిపై విత్తనాల కంట్రోల్ యాక్ట్ -1983 కింద పలు కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. సమావేశంలో డిఏఓ రామారావు నాయక్, ఏడీఏ సంధ్యారాణి, ఏఓ శ్రీదేవి, ఏఓలు జావేద్, వేంకటేశ్వర్లు, జానిమియా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.