రైల్వే శాఖకు ఫైన్లతోనే వంద కోట్లు ఆదాయం..!

by Shyam |
Rs 100 crore fines
X

దిశ, డైనమిక్ బ్యూరో : టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం.. భారీ జరిమానాలు చెల్లించక తప్పదు. ఈ విషయాన్ని ప్రతి బస్సు, రైళ్లో చూస్తూ ఉంటాం. మరి ఇంతలా చెబుతున్నా ప్రయాణికులు వినిపించుకోవట్లేదు. ఎంతలా అంటే ఫైన్ల ద్వారానే వంద కోట్లు ఆదాయం వచ్చేంత. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే తన ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సెంట్రల్ రైల్వేలోని అన్ని జోన్ల పరిధిలో వివిధ ఫైన్లు విధించి రూ.100.82 కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది.

అందులో టికెట్టు లేకుండా ప్రయాణించిన వారికి, మాస్కు ధరించని వారికి, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారికి ఫైన్లు విధించారు. అయితే, టికెట్టు లేకుండా ప్రయాణిస్తూ 1.7 మిలియన్ల మంది దొరకగా.. మాస్కు ధరించని ప్రయాణికులు 23,816 మంది, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మివేస్తూ 29,019 మంది రైల్వే పోలీసులకు చిక్కారు. ఇలా వీరి నుంచి జరిమానాల రూపంలో వంద కోట్లను వసూలు చేశారు.

Advertisement

Next Story