ఎంఎస్ఎంఈలకు రూ. 1.14 లక్షల కోట్లు మంజూరు !

by  |
ఎంఎస్ఎంఈలకు రూ. 1.14 లక్షల కోట్లు మంజూరు !
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వందశాతం క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ. 1.14 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయని, ఇందులో రూ. 56,091 కోట్లను పంపిణీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 32లక్షల మంది ఖాతాదారులకు రూ. 65,863.63 కోట్లను మంజూరు చేయగా, ఇప్పటికే రూ. 35,575.48 కోట్లను పంపిణీ చేశాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు మొత్తం 4.28 లక్షల మంది ఖాతాదారులకు రూ. 48,638.96 కోట్లను మంజూరు చేయగా, ఇందులో రూ. 20,515.7 కోట్లను పంపిణీ చేశాయి. కరోనా వైరస్ వల్ల ఒత్తిడికి గురైన మొత్తం 19లక్షలకు పైగా చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రభుత్వ పథకం సహాయపడింది. ఇది కాకుండా, ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ప్రకటించిన స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద ఎంఎస్ఎంఈ, చిన్న రుణ గ్రహీతలకు రుణాలు ఇచ్చేందుకు ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సిడ్బి రూ. 10,220 కోట్లను మంజూరు చేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.



Next Story