'RRR' ప్రమోషన్స్: భీమ్ ప్రశ్నలు.. రామరాజు కౌంటర్లు(వీడియో)

by Anukaran |   ( Updated:2023-03-24 18:52:48.0  )
RRR ప్రమోషన్స్: భీమ్ ప్రశ్నలు.. రామరాజు కౌంటర్లు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమోషన్లయందు రాజమౌళి టీమ్స్ ప్రమోషన్స్ వేరయా.. అని అంటున్నారు చిత్ర వర్గాలు. ఆయన సినిమా తీయడమే కాదు ఆ సినిమాని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్లాలి అనేది కూడా బాగా తెలిసినవాడు. జక్కన్న ప్రమోషన్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ‘బాహుబలి’ ప్రమోషన్స్ ఎంతటి రచ్చ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఇక తాజాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ని కూడా అంతే లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రియేటర్ కి ఇంకో క్రియేటర్ జోడైతే రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ ని తారక్ తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్ర‌మోష‌న్స్ ఈవెంట్స్ ను లీడ్ చేసే బాధ్య‌త రాజ‌మౌళి, తారక్ కి అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇంకేముంది తారక్ క్రియేటివిటీ అందరికి తెలిసిందేగా.. అలా జక్కన్న బాధ్యత ఇచ్చాడో లేదో.. ఇలా తారక్ ఆచరణలో పెట్టేయడం మొదలుపెట్టాడు.

గత రెండేళ్ల నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ నుంచి కానీ, హీరోల లుక్స్ కానీ ప్రమోషన్ చేయకుండా ఆగిన యూనిట్ ఇక రోజుకో అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఉక్రెయిన్ లో జరుగుతుండగా.. అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని తారక్ అభిమానులతో పంచుకొనున్నాడు. ఫోటోలు వీడియోలతో పాటుగా విరామ సమయంలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ని కూడా తారక్ ట్రిపుల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఫన్నీ వీడియో ను తారక్ పోస్ట్ చేశాడు.

ఉదయం సమయంలో రామ్ చరణ్, కార్తికేయ మాట్లాడుకుంటుండగా తారక్ వచ్చి ” ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా?’ అని అడుగగా.. టేబుల్ పై దరువేసిన చెర్రీ ‘అయిపోయింది’ అని వెటకారంగా చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. ఆ తరువాత రియల్ ‘డ్రమ్స్ ఏవి? కాస్ట్యూమ్స్ లేవు డ్రమ్స్ లేవు.. పొద్దు పొద్దునే తీసుకొచ్చి ఇక్కడ కూర్చో బెట్టారు. దసరా రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు..’ అంటూ కార్తికేయను చరణ్ ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక తారక్ స్వయంగా తీసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండని ఇద్దరు స్టార్ హీరోలు ఒక్కసారిగా అభిమానులకు అప్డేట్ లు ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా ఈ పాన్ ఇండియా చిత్రంలో చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed