RRR క్లైమాక్స్ షురూ.. కలిసొచ్చిన రామరాజు, భీం!

by Jakkula Samataha |   ( Updated:2021-01-19 07:00:09.0  )
RRR క్లైమాక్స్ షురూ.. కలిసొచ్చిన రామరాజు, భీం!
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్(RRR)’ రిలీజ్ గురించి ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కరోనా కారణంగా ఇది మరింత లేట్ కాగా, ప్రజెంట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలిపింది మూవీ యూనిట్. క్లైమాక్స్ షూట్ ప్రారంభమైనట్లు ట్వీట్ చేశారు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి.

‘సాధించాలనుకున్నది నెరవేర్చేందుకు నా రామరాజు, భీమ్ కలిసొచ్చారు’ అంటూ.. చరణ్, తారక్‌ చేతులు కలిపిన ఫొటో షేర్ చేశాడు. డీపీగా కూడా జక్కన్న ఇదే ఫొటోను సెట్ చేయగా.. యాక్షన్ సీక్వెన్స్ అంచనాలు ఎంతైనా పెంచుకోవచ్చు అంటున్నారు అభిమానులు. ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా ఇండియన్ సినిమా హిస్టరీలో మరో బ్లాక్ బస్టర్ రికార్డ్ సెట్ చేసి.. టాలీవుడ్ రేంజ్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉంటుందని గతేడాది ప్రకటించిన మూవీ యూనిట్ కొవిడ్ కారణంగా ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. అభిమానులు నిరుత్సాహంతో ఆ పోస్ట్ గురించి ప్రస్తావించగా..ఫ్యాన్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సీక్వెన్స్ లైవ్‌లో చూసే అవకాశం ఇచ్చారు.

Advertisement

Next Story