ఆవంచలో రౌడీషీటర్‌ హత్య

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: గ్రామం నడిబొడ్డున రౌడీ షీటర్ హత్యకు గురికావడం మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని తిమ్మాజిపేట మండలంలోని ఆవంచకు చెందిన బచ్చలకూర మాసయ్య(40) అనే రౌడీషీటర్‌ శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు.

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మాసయ్య గ్రామం నడిబొడ్డున ఉన్న దర్గా వద్ధ గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కత్తితో దాడి చేశారు. ఇంటికి సమీపంలోని దారి పక్కనే పడిపోయి అరుస్తుండడంతో ఇరుగు పొరుగువారు వెళ్లి పరిశీలించారు. అయితే, మాసయ్య అప్పటికే ప్రాణాలొదిలాడు. మెడ భాగంపై కత్తి పోట్లున్నట్లు గుర్తించారు. జనసంచారం ఉండే ప్రదేశంలోనే హత్య జరగడం గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడైన మాసయ్యపై రౌడీషీట్‌ ఉందని ఎస్సై తెలిపారు.

Advertisement