- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ దావత్‌లో పేలిన తుపాకీ.. నెట్టింట వీడియో హల్‌చల్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రౌడీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక రౌడీ షీటర్ గాలిలోకి తుపాకీతో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నగరంలోని వీధుల్లో తల్వార్‌ల స్వైర విహారం షరా మామూలే ఐనా ఏకంగా రౌడీ షీటర్ చేతిలో తుపాకీ పేలడం పోలీసుల పనితీరు ఏవిధంగా ఉందో తేటతెల్లం చేసింది.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందట నగరంలోని ఆరవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డెయిరీ ఫారం ప్రాంతంలో నగర టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్ కు చెందిన ఫాంహౌజ్‌లో ఓ విందు కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ పట్టణంలో ఆరీఫ్ అనే వ్యక్తి రౌడీ షీటర్‌గా చెలామణి అవుతున్నాడు. అతనిపై ఇప్పటికే రెండు, మూడు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపారు. ఇటీవలే ఆరీఫ్ జైలు నుంచి విడుదల కాగా, అతని అనుచరులు పెద్ధ దావత్‌ను ఏర్పాటు చేశారు. ఫాంహౌజ్‌లో ఏర్పాటు చేసిన దావత్‌కు టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన లీడర్లు, యూత్, ఆరీఫ్ అనుచరులు పాల్గొన్నారు. ఆరీఫ్ ఓ వాహనంపై ఎంట్రీ ఇవ్వగానే అనుచరుడు ఇచ్చిన తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కొందరు అతని అనుచరులు ఈ తతంగాన్ని వీడియో తీసి గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.
అయితే, పేలిన తుపాకీ ఒరిజినలా? కాదా.. అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. నగరంలో ఇప్పటివరకు లైసెన్స్ తుపాకులు కలిగిన వ్యక్తులు బయటకు ప్రదర్శించలేదు. మరి రౌడీ షీటర్ చేతిలో ఉన్న తుపాకీ అసలుదా..? నకిలీదా అనేది తేలాల్సి ఉన్నది. ఆరో టౌన్ పోలీసులు రౌడీ షీటర్ ఆరీఫ్‌ను స్టేషన్‌కు రప్పించి వివరాలను సేకరించే పనిలోపడ్డారు. ఈ నెల 4న నగరంలోని 11వ డివిజన్‌లో నగర మేయర్ సమక్షంలో రేషన్ డీలర్ రహీం ఖయ్యూం పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్‌తో కేక్ కట్ చేసిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి తేరుకోక ముందే రౌడీ షీటర్ చేతిలో తుపాకీ పేలడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది.