సూపర్‌ స్టార్‌తో సహా నలుగురిపై రౌడీ‌షీట్

by  |

దిశ, మునుగోడు: భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఐదుగురిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. కత్తుల జంగయ్య అలియాస్ సూపర్ స్టార్, గుర్రం శివరాజ్ అలియాస్ గుర్రం రాజు, పులి నాగరాజు అలియాస్ పులి రాజు, బచ్చు నాగరాజు, సరగడ హరి అనే అనుచరులు గతంలో భూకబ్జాలు, కిడ్నాప్, బెదిరించి దోపిడీలకు పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. భవిష్యత్తులో వీరు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకే ఉన్నతాధికారుల సూచన మేరకు రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed