ఎంపీడీవో కార్యాలయం నేలమట్టం

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయంలోని రూమ్ నేలమట్టం అయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం తెల్లవారుజామున భవనం గోడ కూలినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎప్పుడు ఏం కూలుతుందో అని అధికారులు, సిబ్బంది భయబ్రాంతులకు గురవుతూ, విధులు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement