పూరీ తనయుడి ‘రొమాంటిక్’ యాంగిల్.. త్వరలోనే

by Jakkula Samataha |
పూరీ తనయుడి ‘రొమాంటిక్’ యాంగిల్.. త్వరలోనే
X

దిశ, సినిమా : తండ్రి పూరీ జగన్నాథ్ సినిమాల్లో బాలనటుడిగా పరిచయమైన ఆకాష్ పూరీ.. ఆ తర్వాత ‘ఆంధ్రాపోరీ’ టైటిల్‌తో తెరకెక్కిన టీనేజ్ లవ్‌స్టోరీలో లీడ్ రోల్ ప్లే చేశాడు. ఫైనల్‌గా పూరీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మెహబూబా’ మూవీతోనే ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా మారినా.. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ఆకాష్.. పూరీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రాన్ని మొదలెట్టాడు. కానీ కొవిడ్ వల్ల షూటింగ్ వాయిదాపడి, పరిస్థితులు చక్కబడ్డాక ఈ మధ్యే ప్రారంభమైంది. కాగా ప్రస్తుతానికి బ్యాలన్స్ ఉన్న షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసి, జూన్ 18న థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు.

https://twitter.com/PaavKiloo/status/1366269754546167808?s=20

Advertisement

Next Story