- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘రొమాంటిక్’ హీరోయిన్‌పై RGV హాట్ కామెంట్స్

దిశ, సినిమా: అనిల్ పాడూరి దర్శకత్వంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ‘రొమాంటిక్’ మూవీకి కితాబు ఇవ్వగా.. తాజాగా ఆర్జీవీ కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘ఈ మూవీలో కేతికా శర్మకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. సినిమాలో తన హాట్‌నెస్ హైలెట్‌గా నిలిచిందని, రొమాంటిక్ మూవీకి తనే ప్లస్ పాయింట్ అని యూత్ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఆకాష్ పూరి రొమాంటిక్ థండర్ స్టార్.. కేతికా శర్మ రొమాంటిక్ హాట్ బ్యూటీ. వీరిద్దరూ తమ కెమిస్ట్రీతో బాక్సాఫీస్‌ను బర్న్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ పాడూరితో పాటు నిర్మాతలు పూరి, చార్మిలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ ట్వీట్‌కు స్పందించిన హీరోయిన్ కేతికా శర్మ వర్మకు థాంక్స్ చెప్పింది. అక్కడితో ఆగని వర్మ.. ‘హే కేతిక! మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తెప్పించిన నీకు.. నేను, ఆడియన్స్ థాంక్స్ చెప్పాలి’ అంటూ రీట్వీట్ చేయడం విశేషం.
స్వేచ్ఛగా బతకలేకపోతే అర్థం లేదు : అమల
లిప్ లాక్‌లే కాదు.. బెడ్రూంలోకి కూడా ఓకే చెప్పిన నటి
https://twitter.com/RGVzoomin/status/1454094244113575943?s=20