వర్ల రామయ్యను బలిపశువును చేశారు : రోజా

by srinivas |
వర్ల రామయ్యను బలిపశువును చేశారు : రోజా
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత వర్ల రామయ్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు బలిపశువును చేశారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నప్పటికీ దళితుడైన వర్ల రామయ్యను బరిలోకి దించారని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన బాబు, గెలిచే అవకాశం లేనప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని కులాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని రోజా స్పష్టం చేశారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్‌‌కే దక్కిందని ఆమె తెలిపారు.

Advertisement

Next Story