మరో వివాహిత బలి… కారణం ఇదే !

by Shyam |
మరో వివాహిత బలి… కారణం ఇదే !
X

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య లహరి ఆత్మహత్య ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మహేశ్వరం మండలం హర్షగూడలో వివాహిత రోజా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే వివాహిత తల్లిదండ్రులు, బంధువులు మాత్రం భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు. అదనపు వరకట్నం కోసం కొద్దిరోజులుగా వేధిస్తున్న భర్త.. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని వాపోయారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. భర్తతో పాటు అత్తమామలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2015లో రోజాకు వివాహం అయ్యింది.

Next Story

Most Viewed