- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ఆర్ఐ పేరిట ఆన్‌లైన్ మోసాలు.. ఆస్పత్రులే టార్గెట్
దిశ, క్రైమ్‌బ్యూరో: నగరంలోని పలు ఆస్పత్రుల్లో రోగులు, బంధువులకు మాయ మాటలు చెప్పి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ విజయ్ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హన్మకొండకు చెందిన కసిడి రాజా రోహిత్‌రెడ్డి అలియాస్ చిన్ను. నగరంలోని గౌలిదొడ్డి పద్మశ్రీ గార్డెన్ లేఅవుట్‌లో నివాసం ఉంటాడు. ఆస్పత్రుల వద్ద తాను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకొని యూఎస్ డాలర్లు కలిగి ఉన్నందున బిల్లు క్లియర్ చేయడానికి ఇబ్బంది అవుతోందంటూ.. మీరు ఆన్‌లైన్ పేమెంట్ లేదా బ్యాంక్ ద్వారా ఇస్తే నగదు రూపంలో చెల్లిస్తానని నమ్మబలికేవాడు. ఈ మాటలను నమ్మిన పలువురు ఇతనికి అన్‌లైన్ లేదా బ్యాంక్ ద్వారా నగదు పంపేవారు. ఈ డబ్బు ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో వారి ఒత్తిడి చేస్తుంటే.. యూఎస్ డాలర్లు భారత్ కరెన్సీలోకి మారడానికి కొంత సమయం పడుతోందని చెప్పేవాడు. ఇలా నగరంలోని సోమాజిగూడ యశోద, గచ్చిబౌలి కేర్, కొండాపూర్ ఏఐజీ, గచ్చిబౌలి కాంటినెంటల్ తదితర 13 ఆస్పత్రులలో సుమారు రూ.4 లక్షలకు మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమాజిగూడ ఆస్పత్రి నుంచి బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి రోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.