సుస్మితా సేన్ రియల్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

by Shyam |
Sushmitha Sen boy friend
X

దిశ, సినిమా : మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ రియల్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనేది ఇప్పుడే కాదు ఒకప్పుడు కూడా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తనకన్నా చిన్నవాడితో డేటింగ్‌లో ఉన్న సుస్మిత.. 1994లో విశ్వసుందరి కిరీటం పొందాక టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నంబర్ ఆఫ్ కాస్మొటిక్ బ్రాండ్స్‌లో నటించేందుకు ఆఫర్లు వెల్లువెత్తాయి. వీటిలో తన ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్‌గా ‘కమయ్’ సోప్‌ను ఎంచుకుంది భామ.

అప్పటి హీరో రోహిత్ బోస్ రాయ్‌తో ఈ యాడ్‌లో నటించగా.. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ యాడ్ రిలీజ్ కాకముందు చూసిన చాలా మంది.. సుస్మిత రియల్ బాయ్ ఫ్రెండ్ రోహిత్ అనే క్వశ్చన్ రెయిజ్ చేశారట. ఇది అప్పట్లో వైరల్ న్యూస్ కాగా.. ఈ విషయాన్ని రోహిత్ లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ద అమేజింగ్ సేన్’ అంటూ ఆ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.


Advertisement
Next Story

Most Viewed