రోహిత్ లేకపోవడం చాలా పెద్ద లోటు : గంభీర్

by Shyam |
రోహిత్ లేకపోవడం చాలా పెద్ద లోటు : గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ లేకపోవడం టీం ఇండియాకు పెద్ద లోటు అని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తొడ కండరాల గాయం కారణంగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయంపై గంభీర్ స్పందిస్తూ.. ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ చక్కగా రాణించాడు. విదేశీ పిచ్‌లపై అతడు నిలకడగా ఆడుతున్నాడు. సఫారీ పర్యటనలో కూడా బాగా రాణిస్తాడని అందరూ భావించారు. కానీ, రోహిత్ ఆ టూర్ మిస్ కావడం టీమ్ ఇండియాకు నిజంగా పెద్ద ఎదురు దెబ్బే. ఇక రోహిత్ స్థానంలో టీమ్ ఇండియాలో స్థానం సంపాదించిన ప్రియాంక్ పంచల్ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని గంభీర్ సూచించాడు.

Advertisement

Next Story