HYD రోహింగ్యాలకు ప్రత్యేక చానెల్..

by  |
HYD రోహింగ్యాలకు ప్రత్యేక చానెల్..
X

దిశ, వెబ్‌డెస్క్ :

హైదరాబాద్‌కు వలసొచ్చిన రోహింగ్యాలు తమ ఉనికిని పెంచుకునే పనిలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ‘రోహింగ్యా టీవీ పేరిట ఓ యూట్యూబ్‌ చానెల్‌’ నడుస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో పలు పోస్టులు కనిపిస్తున్నాయి. బర్మాకు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి ఈ చానెల్‌‌ను రన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ వ్యక్తి రోహింగ్యా భాషలో ప్రసంగాలు చేస్తుండగా.. లోకల్ రోహింగ్యాలు స్పోర్ట్స్ డ్రెస్‌లో ఉన్న కొన్ని వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.

అంతేకాకుండా, ఆ చానెల్‌కు సుమారు 4వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చానెల్‌‌ దేని గురించి అని పహాడీషరీఫ్‌‌లో ఉంటున్న ఓ రోహింగ్యాను ప్రశ్నించగా.. చానెల్‌ గురించి తనకు ఏమీ తెలియదన్నాడు. వీడియోలో ప్రధానంగా షేక్‌ అలీ అనే వ్యక్తి ప్రసంగాలు కనిపిస్తున్నాయి. అతన్ని రోహింగ్యాలు ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ విషయమై బాలాపూర్‌ పోలీసులను ప్రశ్నించగా.. యూట్యూబ్‌ చానెల్‌ గురించి తమకు తెలీదనే సమాధానం ఇచ్చారు.


Next Story

Most Viewed