- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజర్ ఫెదరర్ రిటైర్ అవుతున్నాడా?
దిశ, స్పోర్ట్స్: దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ కెరీర్ ఇక ముగిసినట్లేనా? గాయాలతో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఫెదరర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించగలడా? రిటైర్మెంట్ ఆలోచన ఉంటే అది ఎప్పుడు ప్రకటిస్తాడు? ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఫెదరర్ వింబుల్డన్ ఆడతాడా? ప్రస్తుతం టెన్నిస్ ప్రేమికులనుతొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు రౌండ్లలో విజయాలు సాధించిన ఫెడెక్స్ అనూహ్యంగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పూర్తిగా కోలుకోక పోవడం వల్లే టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని.. తనకు మరింత విశ్రాంతి అవసరమని ఫెదరర్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరో 20 రోజుల్లో వింబుల్డన్ ప్రారంభం కానున్నది. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఫెదరర్ కనీసం ఆ టోర్నీలో అయినా పాల్గొంటాడా లేదా అన్నది అనుమానమే. గత ఏడాది చేయించుకున్న రెండు శస్త్ర చికిత్సల నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్ మ్యాచ్‌లు స్పష్టంగా కనపడింది. ఆ మ్యాచ్‌లో ఫెదరర్ పూర్తి అసౌకర్యంగా కోర్టులో కనపడ్డాడు. అదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ చెప్పాడు. తాను ప్రస్తుతం ఫిట్‌గా లేనని అందుకే తప్పుకుంటున్నానని స్పష్టం చేశాడు.
20తోనే ఆగిపోతాడా?
ఓపెన్ ఎరాలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డును రోజర్ ఫెదరర్ 2018లోనే నెలకొల్పాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఫెడెక్స్.. ఆ తర్వాత మరో టైటిల్ అతడి ఖాతాలో వేసుకోలేక పోయాడు. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత అతను తన మోకాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దాదాపు ఏడాదిన్న పాటు ఇంటి వద్దే ఉంటు విశ్రాంతి తీసుకున్నాడు. తాను ఫిట్ అయ్యానని భావించి ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగినా.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని త్వరగానే తెలుసుకున్నాడు. మరోవైపు రఫెల్ నదాల్ కూడా 20 గ్రాండ్‌స్లామ్స్ సాధించి తనతో సమానంగా నిలిచాడు. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో రఫా ఉన్నాడు. అయితే రోజర్ ఫెదరర్ మాత్రం రెండున్నర ఏళ్లుగా ఒక్క మేజర్ టైటిల్ కూడా లేకుండా కెరీర్ చరమాంకానికి చేరుకున్నాడు. రోజర్ ఫెదరర్ వయసు 40 ఏళ్లకు చేరుకున్నాడు. 2003లో తొలి సారి వింబుల్డన్ సాధించి 14 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో మొత్తం 31 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన ఫెడ్డీ.. 20 టైటిల్స్ గెలిచాడు. 11 సార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు కూడా అతడి పేరిటే ఉన్నది. అత్యధికంగా వింబుల్డన్ 8 సార్లు గెలవగా ఫ్రెంచ్ ఓపెన్ ఒకసారి గెలుచుకున్నాడు. మరి ఫెదరర్ 21వ టైటిల్ గెలుస్తాడా? లేదంటే 20తోనే సరిపెట్టు కుంటాడా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చివరిగా వింబుల్డన్?
రోజర్ ఫెదరర్ 14 ఏళ్ల గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో కేవలం ఒక సారి (2009) మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. అదే సమయంలో అతడు గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో మాత్రం 8 సార్లు విజేతగా, 4 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. తనకు కలసి రాని ఫ్రెంచ్ ఓపెన్‌లో గాయాలతో ఆటను కొనసాగించడం కంటే వైదొలగడమే మేలని భావించినట్లు సన్నిహితులు అంటున్నారు. తనకు కలసి వచ్చిన గ్రాస్ కోర్టులో వీడ్కోలు పలకాలని ఫెదరర్ బావిస్తున్నట్లు తెలుస్తున్నది. వింబుల్డన్‌లో విజయం సాధించినా, సాధించకపోయినా తర్వాత కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తున్నది. ఫెడెక్స్ తన సుదీర్ఘ కెరీర్ ఇక ముగించే సమయం వచ్చినట్లు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొన్నది. 40 ఏళ్ల తర్వాత ఇక కెరీర్ కొనసాగించే ఆలోచన లేదని.. చివరి సారిగా వింబుల్డన్ ఆడి.. టెన్నిస్‌కు గుడ్‌బై పలకాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్ సాధించినా.. మ్యాచ్‌కు అవసరమైన ట్రైనింగ్స్ తీసుకోవడం కష్టమని ఫెదరర్ టీమ్ కూడా అతడికి సూచించింది. జూన్ 28న ప్రారంభం కానున్న వింబుల్డర్ రోజర్ ఫెదరర్ చివరి గ్రాండ్‌స్లామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.