- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చూస్తుండగానే విరిగిపడిన కొండ చరియలు.. భయంతో వణికిపోయిన పర్యాటకులు

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని నహాన్ ప్రాంతం బద్వాస్ సమీపంలో ఉన్న పర్వతానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొండ చరియలు విరిగిపడిపోయాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు.
కొండ చరియలు విరిగిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడుతున్న ఈ వీడియోను కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
हिमाचल के नाहन में चंद पलों में ही भूस्खलन के चलते रोड पाताल में समा गयी । ईश्वर रहम कर..
Road goes down in a landslide after mountain cracks near Badwas, Nahan in Himachal Pradesh. pic.twitter.com/e5614HbnWs
— Srinivas B V (@srinivasiyc) July 30, 2021