వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..!

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా లేబర్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ధర్మసాగర్ మండలం మలకపల్లి గ్రామానికి చెందిన కోటి (25)గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement