నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి.. ముగ్గురి పరిస్థితి విషమం

by Sumithra |
Road accident
X

దిశ, మేడ్చల్: గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జనం అనంతరం కారు ఎక్కుతున్న ముగ్గురు వ్యక్తులను అతివేగంగా వచ్చిన ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శామీర్‌పేట్ చెరువు వద్ద చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు గాయపడిన బాధితులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం గాయపడిన వాళ్లందరూ సికింద్రాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story