భయానక రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి

by Shyam |
roadaccident
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తల్లీ కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని గుమ్మడిదలకు చెందిన బ్రహ్మచారి అనే అతను తన కుటుంబంతో శుభకార్యానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరు ఉన్న బైక్‌ను ఢీ కొనడంతో బ్రహ్మచారికి, అతని కుమారుడికి తీవ్రగాయాలు కాగా, భార్య కల్పన, కూతురు శివాని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed